26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గీతాకార్మిక మహిళా సంఘం గాజుల పండగ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామానికి చెందిన గీతాకార్మిక మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా గాజుల పండగను నిర్వహించుకొన్నారు. స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించిన ఈ గాజుల పండగ కార్యక్రమంలో భాగంగా మహిళలందరు ఏక రూప దుస్తులను ధరించి ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజను నిర్వహించారు. అనంతరం ఒకరినొక్కరు స్నేహాభావంతో తమ స్నేహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ గోరింటాకు పెట్టుకొని, ఒకరినొకరు పసుపు, కుంకుమలను ధరించి గాజులను వేసుకొన్నారు. తధనంతరం అందరు కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక గీతకార్మిక సంఘ మహిళలు పాల్గొన్నారు.

Geetakarmika Women's Association Bangles Festival

More articles

Latest article