26.3 C
Hyderabad
Monday, August 3, 2026

జీజీహెచ్ లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నగర కార్యదర్శి, ఎం.సుధాకర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నాయకులు అడిషనల్ పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు కి గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలో ఉద్యోగుల నిర్లక్ష్యంతో సుమారు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు.  ఆరోగ్యశ్రీ నిధులు జీజీహెచ్ కు రాకపోవడంతో ఎన్నో రకాల వైద్య సేవలు, పరికరాలు రోగులకు అందకుండా పోయాయన్నారు. బాధ్యులైన సిబ్బందిపై జీజీహెచ్ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. సరిపడా మందులు లేక, రోగులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తుందన్నారు. రోగులకు, వారి అటెండర్ కు నాసిరకం భోజనం పెడుతున్నారన్నారని అన్నారు. లక్షలాది రూపాయల నిధులు లెక్కల్లో చూపిస్తున్నా, అవి రోగులకు అందడం లేదని ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలన్నారు.  అడిషనల్ కమిషనర్ స్పందిస్తూ ఈ విషయంపై పోలీస్ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుగుతుందనీ, తప్పకుండా చర్యలుంటాయని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా పాల్గొన్నారు.

More articles

Latest article