రుద్రూర్, బతుకమ్మ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బంద్ పాటించి, సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బీజేపి, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మోసపూరిత మాటలతో బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, సిరిగాది శేఖర్, శానం పోశెట్టి, మతీన్, సంతోష్ పటేల్, శెంకరి వీరయ, కన్నె ప్రవీణ్, చింతల నరేందర్, గోపి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
