27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే చేతుల మీదుగా స్పందన హాస్పిటల్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

  • రోగులకు అందుబాటులో హాస్పిటల్ ఉండడం అభినందనీయం
  • రూరల్ ఎమ్మెల్యేఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి స్టేషన్లో స్పందన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ హర్షద్, నిజామాబాద్ రూరల్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పందన ప్రైవేట్ ఆసుపత్రిని,రిబ్బెనతో కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఇందల్వాయి మండలంలో ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు,రోగులకు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు చేయడానికి మండలంలో స్పందన హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిమాణం అన్నారు.డాక్టర్ రేవంత్ రెడ్డి,డాక్టర్ స్పందనను అభినందించారు. ఆస్పత్రినీ మండలంలో ప్రారంభించడం పట్ల వారిని అభినందించారు. స్పందన హాస్పిటల్ నందు 24 గంటలు సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ రేవంత్ రెడ్డి, డాక్టర్ స్పందన తెలిపారు. ఆసుపత్రిలో ఓపి పాయిజన్, పాముకాటు పాయిజన్, హార్ట్ ఎటాక్,డెంగ్యూ,మలేరియా, షుగర్,బిపి ఆస్తమా, థైరాయిడ్, హాస్పిటల్ నందు ల్యాబ్, ఈసిజి, ఎక్స్ రే, సౌకర్యాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. మండల ప్రజలు తమ హాస్పిటల్ యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపెల్లి సాయి రెడ్డి, రాజేందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ చింతల కిషన్,తదితరులు పాల్గొన్నారు.

Spandana Hospital inaugurated by MLA

More articles

Latest article