25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా  

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు  శుక్రవారం కార్మికులు  ధర్నా నిర్వహించారు.  సమస్యలను పరిష్కరించాలని సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ మాట్లాడుతూ  జీజీహెచ్ ని  వేయి పడకలకు పెంచడంతో పాటు శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని  కోరారు.  దీపావళి పండుగ సందర్భంగా  కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  ఈ ధర్నా యూనియన్ నాయకులు స్వరూప భారతి సాయికిరణ్ వెంకట్ మరియు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.


Dharna to resolve workers' problems

More articles

Latest article