కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా  

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు  శుక్రవారం కార్మికులు  ధర్నా నిర్వహించారు.  సమస్యలను పరిష్కరించాలని సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ మాట్లాడుతూ  జీజీహెచ్ ని  వేయి పడకలకు పెంచడంతో పాటు శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని  కోరారు. ...