27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జఫ్స్ ప్రాంగణంలో 16 గ్రామాల నుండి 16 టీంలను ఏర్పాటు చేసి ” కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ” భాగంగా యువత డ్రగ్స్ చెడు వ్యసనాలకు దూరముగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని జక్రాన్ పల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహించారు.  వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రియమైన యువకులకు  మీరందరూ ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని, ఆటలో స్పూర్తిని చూపినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు , మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలి. ఈ రోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోంది. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే , జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. యువత దేశ భవిష్యత్తు,  మీరు ఆరోగ్యంగా ఉంటూ , మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి. మిమ్మల్ని వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయి. మన బాధ్యతలు మనమే గుర్తించాలి. మంచి స్నేహితులను , మంచి అలవాట్లను ఎంచుకోవాలి. మీరు చేసిన ప్రతి మంచి పని , మీ కుటుంబాన్ని , సమాజాన్ని గర్వపడేలా చేస్తుంది. అనంతరం క్రీడాకారులకు బహుమతులు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి , డిచిపల్లి  సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. వినోద్ ,  జక్రాన్ పల్లి  పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాలిక్ రెహమాన్,  16 వాలీబాల్ జట్ల యువత, పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

The future of the country would be better if the youth walked the right path.

More articles

Latest article