30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మంత్రి ధనసరి  సీతక్క

 

ములుగు, బతుకమ్మ: రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనీ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి  అనసూయ సీతక్క అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలం పాలంపేట లోని హరిత కాటేజ్ లో  వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ శిక్షణలో భాగంగా గత తొమ్మిది రోజులుగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, తెలంగాణ టూరిజం తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న ఈ శిక్షణా శిబిరాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించి శిక్షణ తీసుకుంటున్న  వాలంటీర్స్ తో ముఖాముఖి మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కాకతీయుల చరిత్ర గురించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి  రాష్ట్రం, విదేశాల నుండి  వచ్చిన విద్యార్థిని, విద్యార్థులను   ఉద్దేశించి మాట్లాడుతూ తన జీవితం లో ఏ విధంగా ఈ స్థితికి వచ్చాను ఇక్కడున్న ప్రాంత ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు,  మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక మీ ప్రదేశాల్లో కాకతీయుల గురించి వివరించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాండురంగారావు  మాట్లాడుతూ వరుసగా ఇది నాలుగవసారి వరల్డ్ హెరిటేజ్ క్యాంప్ రామప్పలో నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం వివిధ ప్రదేశాల నుండి వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు కాకతీయుల కళా సంపద వారసత్వం వాటిని ఎలా కాపాడుకోవడం అనే అంశాల మీద మరియు వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ మాట్లాడుతూ

Ramappa's fame should be spread to the world.

మంత్రి  పర్యాటక రంగానికి మేడారంకి ఏవిధంగా అభివృద్ధి  చెందడానికి ప్రయత్నిస్తున్నారో, టూరిజం తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ముఖ్యంగా యూత్ కి ప్రజలకు పర్యాటకం ఏ విధంగా దోహదపడుతుందనే అంశాల గురించి వివరించారు. శిక్షణలో భాగంగా ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి ఎన్ఐటి నుండి వచ్చి జాగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం మీద సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వైఎల్ శ్రీనివాస్  క్యాంపుకు వచ్చి వాలంటీర్స్ కి ముఖ్యమైన సలహాలు సూచనలు టూరిజం కల్చర్ హెరిటేజ్ గురించి వివరించారు. డాక్టర్ జి మహేష్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ మీద ప్రసంగించారు. ఆ తర్వాత డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ తెలంగాణ టూరిజం ప్రొడక్ట్స్ తెలంగాణ టూరిజం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ టూరిజం యొక్క విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు  డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్,  వాలంటీర్స్,  తదితరులు పాల్గొన్నారు.

Ramappa's fame should be spread to the world.

More articles

Latest article