29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బంద్ కు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్

 

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ : బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న బీసీలు తలపెట్టిన బంద్ కు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాలని బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి  వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను రద్దు చేయించేందుకు అనేకమంది కుట్రలకు  పాల్పడుతున్నారని, ఇందుకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులను ఎండగట్టి రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్ల సాధన కోసం బంద్ ను చేపడుతున్నామని, బీసీ రిజర్వేషన్ లు పెంచడం ద్వారా అన్ని కులాల కు రాజకీయ ప్రాతినిథ్యం పెరుగుతుందని, అంతిమంగా రాజ్యాధికారం లో బీసీ లకు జనాభా దామాషా ప్రకారం వాటా దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్,కొట్టాల రామకృష్ణ,గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు,అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరు రమేష్, బిసిటియు నాయకులు గంగోనె సంజీవ్, చంద్రకాంత్,గంగయ్య, సతీష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article