25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తప్పిన ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన తెయూ వీసీ కారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్​,బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్  కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డిచ్​పల్లి నుంచి నిజామాబాద్​కు వచ్చే దారిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మాధవనగర్​ బైపాస్​ వద్ద కారుకు ముందున్న వాహనం సడెన్​ బ్రేక్​ వేయడంతో తప్పించే ప్రయత్నంలో కారులో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో వీసీ యాదగిరిరావు లేరు డ్రైవర్​ ఒక్కరే ఉన్నారు. అయితే ఆయనకు సైతం ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ప్రమాదం  తప్పింది

 

More articles

Latest article