నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో ఎన్.జి.ఓ. లయన్స్ క్లబ్ సంస్కృతి, హైదరాబాద్, ప్రభుత్వ ఆరోగ్యశాఖ నిజామాబాద్ వారి సహకారంతో సోమవారం విద్యార్థులకు, “మెంటల్ వెల్నెస్ & మెంటల్ హెల్త్ అవగాహన” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం కాపాడుకుంటేనే ఇంకా ఏదైనా సాధించగలమని, విద్యార్థులు మంచి జీవన శైలిని అలవర్చుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ రవితేజ, మానసిక వైద్య నిపుణులు మాట్లాడుతూ ‘సెల్ ఫోన్’ మానవాళికి వరం మరియు శాపంగా మారుతుందని అన్నారు. విద్యార్థులు సమయపాలన లేకుండా సెల్ ఫోన్’ తినే గడపడం వల్ల అనేక మానసిక రుగ్మతలు, మానసికమైన రోగాలు వస్తున్నాయని, వాటిని అధిగమించడానికి మార్గాలను వివరించారు. ఆరోగ్యశాఖ ట్రైనర్స్ సులోచన, వెంకటేశ్వర్లు మానసిక ఆరోగ్య విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, పీఆర్.ఓ. డాక్టర్ దండుస్వామి, ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం ఆఫీసర్స్, నాగజ్యోతి, రజిత, సుధాకర్, దస్తప్ప, నరేష్ కుమార్, వెంకట రమణ, ఫిజిక్స్ విభాగం అధిపతి రామకృష్ణ, అధ్యాపకులు శ్రీనివాస్, శమంత, రాధిక, అర్చన, కె. గంగాధర్, విద్యార్థులు, ఎన్.సి.సి. కెడేట్స్, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్స్ పాల్గొన్నారు.
