25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మార్వోలు  రైతులను  ఇబ్బందులకు గురి చేస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్

కామారెడ్డి, బతుకమ్మ : ఎమ్మార్వోలు  రైతులను  ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్ అన్నారు. ఆయన  ఆధ్వర్యంలో రామారెడ్డి మండల అధ్యక్షులుగా సదాశివ నగర్ మండలం ఇన్చార్జిగా  మంత్రి భగవాన్ ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు  జారీ చేసి నియమిక  పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి మండల అధ్యక్షులుగా సదాశివనగర్ మండలం ఇన్చార్జిగా మంత్రి భగవాన్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఎమ్మార్వోలు  రైతులకు ఎన్నో రకాల  అన్యాలకు గురి చేస్తున్నారని ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే జిల్లా కలెక్టర్కి నివేదిక సమర్పిస్తామని హెచ్చరించడం జరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టి కూడా తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. సొంత తండ్రి సంబంధించిన  ఆస్తిని కొడుకు పేరు మీద మార్పిడి చేయడానికి ఎన్నో సంవత్సరాలు గడిచిన  కూడా రైతులకు న్యాయం  చేయడం లేదని రైతులను రామారెడ్డి ఎమ్మార్వో  చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More articles

Latest article