నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైకిల్ పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి బైక్ డివైడర్ ను ఢీకొంది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం గా ఉంది. శనివారం రాత్రి దుర్భాబాధి రోడ్డు లోని శివాజీ చౌక్ నుంచి కృష్ణ మందిర్ వైపు పల్సర్ బైక్ పై ప్రశాంత్, సందీప్ లు వెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా సైకిల్ పై వస్తున్న వ్యక్తి ని తప్పించబోయి పక్కనే ఉన్న డీవైడర్ ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రశాంత్ మృతి చెందగా, సందీప్ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. మృతుడు తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
