24 C
Hyderabad
Sunday, August 2, 2026

పోతుగుట్ట హనుమాన్ ఆలయంలో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన పోతుగుట్ట హనుమాన్ దేవాలయంలో శుక్రవారం రాత్రి  చోరీ జరిగింది.  దుండగులు తాళం పగలగొట్టి  ఆలయంలోకి  చొరబడి దేవుడి వెండి కళ్లను, వెండి నామాలను, గంటను,విలువైన వస్తువులను దొంగలించారు.  గతంలో  పలుమార్లు ఆలయంలో చోరీ జరిగిందని,  దేవుడి ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More articles

Latest article