24 C
Hyderabad
Sunday, August 2, 2026

అపూర్వ కలయిక

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ: చాలా సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ కలుసుకోవడం ఒక అపూర్వ కలయిక అని పదవి విరమణ పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు లింబాన్న అన్నారు. శుక్రవారం 2010-11 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ నిర్వహించిన ఆత్మీయుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అందరూ ఒకే చెట్టు నీడన బాల్యాన్ని ఆటపాటలతో గడుపుతూ సంతోషంగా చదువుకున్నారు. ఉన్నత చదువులకై వివిధ ప్రాంతాలకు వెళ్లి చదువుకొని జీవితాల్లో స్థిరపడ్డారు. 15 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు ముప్కాల్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది. వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి  జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 2010-11 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article