27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆలయానికి సౌండ్ సిస్టం యూనిట్ వితరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ చిలుకల చిన్నమ్మ ఆలయానికి సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైర శేఖర్ సౌండ్ సిస్టం అందజేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన ఆలయాన్ని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆధునీకరించారు. కొత్త నిర్మాణాలతో అందంగా అలంకరించారు. ఇటీవల విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించడం భక్తి పాటల కోసం సౌండ్ సిస్టం కిట్ ను సొంత ఖర్చులతో జర్నలిస్టు శేఖర్ కొనుగోలు చేసి ఇచ్చారు. సంఘం ప్రతినిధులు ఆలయ కమిటీ సమక్షంలో యాంప్లిఫయర్, రెండు యూనిట్లు ఇతర పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ప్రవీణ్ రాజ్ కుమార్, గంగా ప్రసాద్, బాలకిషన్ లింబాద్రి, చక్రధర్, నర్సయ్య,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article