30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ ఎం.హరిత
  • బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ

 

సిరిసిల్ల, బతుకమ్మ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. బోయినిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలు, వార్డులను పరిశీలించి, సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలని, ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

Provide better medical services to patients

More articles

Latest article