రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ ఎం.హరిత బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ సిరిసిల్ల, బతుకమ్మ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. బోయినిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలు, వార్డులను పరిశీలించి, సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో...