28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

టేకు చెట్ల దొంగల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : టేకు చెట్లను దొంగతనంగా నరికి దుంగలను అమ్ముతున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్ట్ 19న గోపాల్ శ్రీధర్ తన మామిడి తోటలోని సుమారు 20టేకు చెట్లను దొంగతనంగా నరికి ఎత్తుకెళ్లారని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా గురువారం జావేద్, మహమ్మద్ అబ్బాస్ లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.95000 ఉంటుదని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు.  నిందితులను అరెస్ట్ చేయటం లో ప్రతిభ చూపిన మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్, ఐడి పార్టీ సిబ్బంది రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, చందు లను ఏసీపీ నిజామాబాదు అభినందించారు.

More articles

Latest article