30.2 C
Hyderabad

మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం బాధ్యత

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : మనిషి మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం తన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి (సీనియర్ సివిల్ జడ్జి) రాధిక జైస్వాల్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, ఎస్సై  రాహుల్ రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు  చింతోజు భాస్కర్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article