29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మహ్మదీయ కాలనీలో జిమ్ యజమాని ఇంట్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

  • రూ.7.5 లక్షల నగదు, 2.5 తులాల బంగారం చోరీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహ్మదీయ కాలనీలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం ఇంటి యజమాని హైద్రాబాద్ నుంచి తిరిగి రావడంతో చోరీ ఘటన వెలుగు లోకి వచ్చింది. మహ్మదీయ కాలనీలోని మహ్మదియా గెస్ట్ హౌజ్ సమీపంలో నివసిస్తున్న జిమ్ యజమాని యండి సాబేర్ రెండు రోజులు క్రితం బందువుల ఇంటికి హైద్రాబాద్ వెళ్లాడు. కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి వెల్లగా ఇంటివెనుక ఉన్న డోర్ ద్వార లోనికి ప్రవేశించిన అగంతకులు బీరువాను ధ్వంసం చేసి రూ.7.50 లక్షల నగదు, 2.5 తులాల బంగారు నగలను చోరీ చేశారు. ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు నిప్పు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటన స్థలాన్ని 2 వ టౌన్ పోలీసులు సందర్శించారు. రెండు రోజుల క్రితమే చోరీ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో మహ్మదీయ కాలనీలో చోరీ జరుగడం రెండవ సారి. పోలీసులు పండగ బందోబస్తులో ఉండగా చోరులు తమ చోర కళను ప్రధర్శించారని చెప్పాలి.

Burglary at gym owner's house in Mohammedia Colony

More articles

Latest article