మహ్మదీయ కాలనీలో జిమ్ యజమాని ఇంట్లో చోరీ
రూ.7.5 లక్షల నగదు, 2.5 తులాల బంగారం చోరీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహ్మదీయ కాలనీలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం ఇంటి యజమాని హైద్రాబాద్ నుంచి తిరిగి రావడంతో చోరీ ఘటన వెలుగు లోకి వచ్చింది. మహ్మదీయ కాలనీలోని మహ్మదియా గెస్ట్ హౌజ్ సమీపంలో నివసిస్తున్న జిమ్ యజమాని యండి సాబేర్ రెండు రోజులు క్రితం బందువుల ఇంటికి హైద్రాబాద్ వెళ్లాడు. కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి వెల్లగా ఇంటివెనుక ఉన్న డోర్...