24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రేమ విఫలమైందని ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లికి చెందిన హోన్నాజీపేట అజయ్(21)  ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో ఈనెల 10వ తేదీన పురుగుల మందు తాగాడు. నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

More articles

Latest article