27.4 C
Hyderabad

కడుదయనీయం… రెండు కిడ్నీలు చెడిపోయి.. 

Must read

📰 Generate e-Paper Clip

  • ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

 

ఆర్మూర్, బతుకమ్మ : రెండు కిడ్నీలు చెడిపోయి కడు దయనీయ పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని   పట్టణంలో నివసిస్తున్న  కళ్యాణి శనివారం తెలిపారు. తన భర్త దేదావత్ శాంతి లాల్ రెండు కిడ్నీలు చెడిపోయాయని, గత రెండు సంవత్సరాల నుండి హాస్పిటల్కు వెళ్తున్నామని తెలిపారు. హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చూపించామని దాదాపుగా ఇప్పటివరకు ఐదు లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపారు. కేవలం 15 వేల జీతంతో పట్టణ హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో కాంట్రాక్టు బేసిక్ గా పనిచేస్తున్నానని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అమ్మ, అన్న చనిపోయారని, ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడని తెలిపారు. ఎటువంటి ఆధారం లేదని, ప్రస్తుతం పట్టణ ఏరియా ఆసుపత్రిలో ఒకరోజు తప్పించి ఒకరోజు డయాలసిస్ చేస్తున్నారని తెలిపారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలని 9121744642 ఫోన్ పే నంబర్ కు సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

More articles

Latest article