. . . చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు
మెండోరా, బతుకమ్మ :
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల వద్ద చేపలు పట్టేందుకు వెల్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. దానితో ఎస్ఆర్ ఎస్ పి అధికారులు స్పిల్ వే గేట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా ఈరోజు సాయంత్రం తర్వాత ఏ సమయంలో నైనా ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్ల ద్వారా గోదావరి నదిలోకి వదలబోతున్నాము అని తెలిపారు.కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది తీరం లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
