- ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : రైతుల సమస్యలపై పార్టీలకతీతంగా నాయకులంతా ఏకతాటిపై రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో శుక్రవారం సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ కలయిక కిసాన్ మిలాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ముర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు తరలివచ్చారు.ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ అలీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రైతులతో ఆత్మీయంగా కలుసుకునేందుకు ప్రతియేటా ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు అన్వేష్ రెడ్డి చెప్పారు. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ఈ సాంప్రదాయం కొనసాగిస్తామని వెల్లడించారు.

