బతుకమ్మ, జుక్కల్ జుక్కల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం వాటర్ మాన్ లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మిషన్ భగీరథ డిఈఈ కౌశిక్ మాట్లాడుతూ గ్రామాల్లో వాటర్ ట్యాంకులు వారానికి ఒకసారి శుభ్రంగా కడగాలని ఆయన వాటర్ మాన్ లకు ఆదేశించారు. ట్రైనర్ నాగేశ్వర్ రావు శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామాల్లో ఇలాంటి తాగునీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు సక్రమంగా ఉన్నాయా లేదా చూడాలని ఆయన ఆదేశించారు. ఎక్కడన్నా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈఈ నయీమ్, ల్యాబ్ స్టాపర్ మెల్పర్స్, గ్రామాల్లో వాటర్ మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు.

