24.7 C
Hyderabad
Monday, August 3, 2026

“బార్” బరువు బాధ్యతలలో నేను సైతం

Must read

📰 Generate e-Paper Clip

  • బార్ అసోసియేషన్ ఉపాధ్యాక్షులు రెంజర్ల సురేష్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చరిత్రాత్మకమైన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యాక్షునిగా విధులను స్వీకరించడం అదృష్టంగా బావిస్తున్నట్లు రెంజర్ల సురేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం  మాట్లాడారు. బార్ బరువు బాధ్యతలలో నేనుసైతం సమపాలుగా పాల్గొని న్యాయవాదుల అభ్యున్నతికి పాటు పడతానని అన్నారు. ఈ సందర్బంగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు మాట్లాడుతు గత మార్చి నెలలో నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో దిలీప్, సురేష్ లకు సరి సమానంగా ఓట్లు లభించడంతో చెరి ఆరు నెలల పదవికాలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మొదటి విడతలో దిలీప్ ఉపాధ్యక్షునిగా విధులు నిర్వహించారని అక్టోబర్ నుండి మార్చి, 2026 వరకు సురేష్ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ అమిదాల సుదర్శన్,బార్ కోశాధికారి నారాయణ దాసు,సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్,ఆనంద్ రెడ్డి,బిర్లా రామరావు,బాస రాజేష్వర్, సురేష్ బాబు,జక్కుల వెంకటేశ్వర్, సుదర్శన్ రెడ్డి,శశిధర్ రెడ్డి, ఎమ్. ఎ ఖయ్యుమ్, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article