బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో రేణుక శరన్నవ రాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య మహా చండీ యాగం యాగం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మహా చండీ యాగానికి దాతలుగా ముందు వచ్చిన తెల్ల అక్షర రవికుమార్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కప్ప సంతోష్, శ్రీకాంత్, మామిడి కన్న,చిత్తరి సంజీవ్, వర్షిత్ గుప్తా, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
