28.9 C
Hyderabad

ఐపీఎఫ్ (యూఏఈ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుని సన్మానించిన బిజెపి నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఇండియన్ పీపుల్స్ ఫోరం ఐపీఎఫ్ (యూఏఈ) రాష్ట్ర అధ్యక్షులు  కుంబాల మహేందర్ రెడ్డి ని బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్ర రెడ్డి, జిల్లా కార్యదర్శి  ముద్దుల బుగ్గారెడ్డి, సీనియర్ నాయకులు సల్ల సత్యం రెడ్డి, ఎలుసాని పరశురాములు, కమ్మరి ఆంజనేయులు,శ్రీనివాసు లు పదిర గ్రామంలోని ఆయన నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఇటీవల కాలంలో ఇండియన్ పీపుల్స్ పోరం ఆధ్వర్యంలో యూఏఈ లో  బతుకమ్మ వేడుకలను తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా  దుబాయిలో యూఏఈ లో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం గల్ఫ్ లో తెలంగాణ యొక్క పండుగలను ఘనంగా నిర్వహిస్తున్న  కుంభాల మహేందర్ రెడ్డి ని బిజెపి నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు.

More articles

Latest article