25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వేతనాల కోసం జిపి కార్మికుల రాస్తారోకో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి: తమకు మూడు నెలలుగా జీతం ఇవ్వడం లేదని దసరా పండగ ఉన్నందున ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని కోటగిరి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కోటగిరి పోతంగల్ రహదారిపై జిపి కార్మికులు బైఠాయించి సోమవారం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసి వేతనాలు ఇవ్వాలని అధికారులను కోరారు. నాలుగు రోజుల్లో దసరా పండుగ ఉన్నందున తమకు వేతనాలు చెల్లించాలని లేదంటే తన ఇంట్లో పండగ జరుపుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతం ఇవ్వకపోతే తమ కుటుంబ పోషణ గడిచేది ఎలా అని అధికారులను ప్రశ్నించారు. వెంటనే తమ మూడు నెలల వేతనాలను విడుదల చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article