26.3 C
Hyderabad

39 గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కులు..

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,59,763 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. ఎస్సారెస్పీ 39 గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 5500 క్యూసెక్కులు ఎస్కే గీత ద్వారా 20050 సరస్వతి కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం  1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శనివారం 1086.00 అడుగులు, 62.937 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

More articles

Latest article