- నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
బోదన్, బతుకమ్మ : భారీ వర్షాలు, నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల వరద, మహారాష్ట్రలోని విష్ణూపురి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద వస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. శుక్రవారం రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి బ్రిడ్జీ పైనుంచి వరద పోంగిపోర్లుతుండటంతో అధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణకు, మహరాష్ట్రకు రాకపోకల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాగల రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. కమీషనర్ వెంట బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.సంతోష్ రెడ్డి, రెంజల్ ఎస్ఐ కె.చంద్ర మోహన్, రెంజల్ ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

