గోదావరి పరివాహక ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య బోదన్, బతుకమ్మ : భారీ వర్షాలు, నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల వరద, మహారాష్ట్రలోని విష్ణూపురి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద వస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. శుక్రవారం రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి బ్రిడ్జీ పైనుంచి వరద పోంగిపోర్లుతుండటంతో అధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణకు, మహరాష్ట్రకు రాకపోకల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాగల రెండు మూడు రోజులు...