27.3 C
Hyderabad
Friday, July 31, 2026

అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానం

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ : అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని కోలవర్ కుమార్ సెట్ అన్నారు.  గురువారం బిచ్కుంద మండలం లోని  జై వాసవి ఆర్య వైశ్య దుర్గాభవాని మండపం వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దుర్గామాత మండపాల్లో దేవికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆలయ మండపాల నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రామచందర్ సెట్, సంజు సెట్  మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందని గ్రామాలలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. దేవి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

The greatest charity of all is the great charity.

More articles

Latest article