- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రంలోని బిసి కాలనీలో కరెంటు సమస్యను ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఎమ్మెల్యే ను కలిసిన మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం , మాజీ ఎంపిటిసి సుంకరి రాము, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమలేష్ , సొసైటీ డైరెక్టర్ భోజన యాదవ్ లు కరెంట్ సమస్యపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ట్రాన్స్కో అధికారుల తో ఫోన్లో మాట్లాడి, కరెంట్ సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఏడికి ఎమ్మెల్యే ఆదేశించారు.
