నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు ప్రక్రియ, ఎస్పీ, ఎస్టీల రిజర్వేషన్ శాతం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు తెలపాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను ఏ చట్టం, నిబంధనల ప్రక్రియ ద్వారా అమలు చేస్తున్నారో తెలుపాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారో తెలుపాలని కోరారు. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ కమిషన్ ద్వారా వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణన చేశారని అన్నారు. ఈ కులగణన నివేదిక ఆధారంగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని కోరారు.
