నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమా ఓజి విడుదలకు ఒక రోజు ముందే థియేటర్ల వద్ద ఆయన అభిమానుల సందడి మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లలిత మహల్ థియేటర్లో గురువారం విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున భారీ ఎస్ఈడి లైటింగ్ ఏర్పాటు చేశారు. 40 అడుగుల భారీ కటౌట్ ను అభిమానులు థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేశారు. చాలా రోజుల తర్వాత అత్తమ్మ అభిమాన నాయకుడు మళ్ళీ తెరపై మరికొన్ని గంటల్లో వస్తున్న నేపథ్యంలో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్ వద్ద డాన్సులు ఆయన ఆయన అభిమానులు తన చిత్రపటాన్ని పట్టుకొని డ్యాన్సులు చేస్తూ అసలైన దసరా పండగ ముందే వచ్చింది అంటూ పేర్కొన్నారు.


