నిజామాబాద్, బతుకమ్మ : పన్నెండు సంవత్సరాల లోపు బాలికను అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో ఒక బాలునికి మూడు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ బాలల న్యాయ మండలి చైర్ పర్సన్ (జూనియర్ సివిల్ జడ్జి )కుష్భు ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు వెలవరించినట్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ రహీమోద్దీన్ తెలిపారు. ఆయన వివరాలు.. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని బాలుడు అదే గ్రామానికి చెందిన పన్నెండు ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిన పిదప ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించిన అనంతరం పూర్తిస్తాయి నేర విచారణ జరపి అభియోగ పత్రం బాలల న్యాయ మండలి లో సమర్పించారు. నేర న్యాయ విచారణలో భాగంగా బాధిత బాలికను, ఇతర సాక్షుల వాంగ్మూలలు నమోదు చేసిన, ధ్రువీకరించుకున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలు అధ్యయనం చేసిన న్యాయ మండలి బాలునిపై నేరారోపణ రుజువు అయినట్లు నిర్దారించింది. ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 376(ఎ బి) ప్రకారం మూడు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. పిల్లలపై లైంఘిక అత్యాచారాల చట్టం సెక్షన్ ఆరు ప్రకారం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. రెండు శిక్షలు ఏక కాలంలో అనుభవించాలని జడ్జి కుష్భు తమ తీర్పులో పేర్కొన్నారు. బాలుడిని హైదరాబాద్ లోని బాలల పరిశీలక గృహంలో ఉంచాలని తీర్పులో ఆదేశించారు.
