బాలునికి మూడేళ్ళ సాధారణ జైలుశిక్ష

నిజామాబాద్, బతుకమ్మ : పన్నెండు సంవత్సరాల లోపు బాలికను అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో ఒక బాలునికి మూడు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ బాలల న్యాయ మండలి చైర్ పర్సన్ (జూనియర్ సివిల్ జడ్జి )కుష్భు ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు వెలవరించినట్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ రహీమోద్దీన్ తెలిపారు. ఆయన వివరాలు.. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని బాలుడు అదే గ్రామానికి చెందిన పన్నెండు ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిన పిదప ప్రాథమిక...