- కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలి
- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
మాచారెడ్డి, బతుకమ్మ : సస్పెక్ట కదలికలపై నిఘా పెట్టాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, పరిసరాలను తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్సై అనిల్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల మర్యాద వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సూచించారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉంచాలని సూచించారు. దేవాలయాలు, ప్రార్థన స్థలాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దుర్గా నవరాత్రి సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నైట్ పెట్రోలింగ్ పెంచాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్, మాచారెడ్డి ఎస్ఎచ్ఓ అనిల్, సిబ్బంది ఉన్నారు.

