27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ ఫుట్ పాత్ పై వ్యాపారం.. ట్రాఫిక్ పోలీస్ సీరియస్

Must read

📰 Generate e-Paper Clip

  • పుట్ పాత్ ఆక్రమణల తొలగింపు
  • పుట్ పాత్ పై వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్ పరిధిలో ఫుట్ పాత్ పై వ్యాపారం  పై ట్రాఫిక్ పోలిసులు కన్నెర్ర చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశ (జిల్లా విజిలెన్స్ మానిటరింగ్) కమిటీ సమావేశంలో మున్సిపల్ కాంప్లెక్స్ లో చాలామంది బినామీల చేతిలో షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, పుట్ పాత్ లను ఆక్రమించి దందా జరుగుతుందని దానివాలన పాదచారులకు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని దిశ కమిటీ సభ్యులు అధికారులను నిలదీశారు. దానితో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు

Business on the footpath of Tilak Garden Complex.. Traffic police serious

బుధవారం రంగంలోకి దిగారు. తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి గ్లామర్ హోటల్, శక్తి కూల్ డ్రింక్స్ తో పాటు ఇతరులు  ఫుట్ పాత్ పై ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను ఫ్లెక్సీలను వారు తొలగించారు. ఫుట్ పాత్ పై వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ ఆలీ అన్నారు. పుట్ పాత్ లను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఐతే గ్లామర్ హోటల్ ముందు పుట్ పాత్ పై ఉన్న జనరేటర్ ను మాత్ర తొలగించలేదు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Business on the footpath of Tilak Garden Complex.. Traffic police serious

More articles

Latest article