27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50వేలు చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నష్టపరిహారం ఇవ్వకుంటే మరో ఆందోళన తప్పదు
  • రోడ్డెక్కి ఆందోళన చేసిన రైతులు

 

నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకో  నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పోచారం, మాల్ తుమ్మెద, గోలి లింగాల్, వాడి, చీనూర్, నాగిరెడ్డిపేట్, బంజారా తండా, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మాసాని పల్లి, ఆత్మకూరు, జలాల్ పూర్, ఎర్రారం గ్రామాల రైతులు తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మంజీరా నది వరదతో పాటు, నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంటలు నీట మునిగి రైతులకు భారీగా నష్టం వాటిల్లితుందని ప్రభుత్వం 21 రోజులు గడిచిన ఇంతవరకు  స్పందించకపోవడం బాధాకరమని అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు గండ్లు పడి పంటలకు నష్టం వాటిల్లిందని. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు పరిహారం అందజేస్తామని సరైన ప్రకటన చేయలేదని. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో ఉంటున్న ఎమ్మెల్యే ప్రజల కష్టాలు తెలుస్తలేవని ఇక్కడ ఉన్న వాళ్ళతో సమాచారం తీసుకుని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వర్షాల నేపథ్యంతో రోజురోజుకు పెరుగుతుందని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24 గంటల్లో నీటిని కాళీ చేయించానని ప్రస్తుత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఒక్కరోజు మాత్రమే  నీటిని వదిలే విధంగా చూసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యక్ష హామీ ఇచ్చేవరకు రోడ్డుపై నుండి కదిలేది లేదంటూ రైతులు మొండికేయడంతో స్థానిక పోలీసులు, అధికారులు ధర్నా వద్దకు చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆర్డీవో రావాలంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఆర్డీవో తో చరవాణిలో మాట్లాడించారు. ముంపుకు గురైన రైతుల పంటల వివరాలు నమోదు చేశామని ప్రభుత్వానికి నివేదిస్తున్నామని అందరికీ నష్టపరిహారం అందేలా రెవెన్యూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి నివేదిక తయారు చేస్తున్నామని అలాగే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ను తొలగించేందుకు ప్రాజెక్టు నుండి అదనంగా మరి కొన్ని గేట్లు తెరిపించేందుకు కలెక్టర్ తో మాట్లాడతానని  రైతులు ఆందోళన విరమించాలని కోరడంతో రైతులు శాంతించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి హామీ రాకపోతే  మరో ఉద్యమానికి సిద్ధమని మండల రైతులు హెచ్చరించారు. అనంతరం తహసిల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బొల్లు నరసింహారెడ్డి, రాజ్ దాస్ జయరాజ్, మనోహర్ రెడ్డి, గుర్రాల సిద్దయ్య, రాజిరెడ్డి, దుర్గా రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ యాదయ్య, కాంతం రెడ్డి, యాదగిరి, నాగేశ్వర్ రెడ్డి, నరేష్, రామకృష్ణ, తదితరులతోపాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Rs. 50,000 per acre should be paid to every farmer whose crop has been damaged.

More articles

Latest article