పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50వేలు చెల్లించాలి
నష్టపరిహారం ఇవ్వకుంటే మరో ఆందోళన తప్పదు రోడ్డెక్కి ఆందోళన చేసిన రైతులు నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పోచారం, మాల్ తుమ్మెద, గోలి లింగాల్, వాడి,...