27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దుర్గనవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండపాల నిర్వాహకులను నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరీఫ్ కోరారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో దుర్గామాత ఆర్గనైజర్లతో మీటింగ్ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పది రోజుల పాటు జరిగే ఉత్సవాలు దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరిగేలా నిర్వాహకులు సహకరించాలన్నారు. పోలీసు శాఖ మండపాల నిర్వాహకులతో అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు. విద్యుత్ వినియోగంలో జాగ్రత్త వహించాలని, తప్పనిసరిగా ఆ శాఖ అనుమతులు తీసుకోవాలని కోరారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, పత్తాలాట, మద్యం సేవించడం పూర్తిగా నిషేదమని తెలిపారు. 24 గంటల పాటు మండపాల వద్ద భద్రత బాధ్యతలు ఆర్గనైజర్లదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

 

More articles

Latest article