- తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చిన విద్యార్థులు
- అలరించిన సాంప్రదాయ నృత్యాలు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ,విద్యార్థుల తల్లి దండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని తీరొక్క రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పలువురిని అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,విద్యార్థులకు బతుకమ్మ ప్రాముఖ్యతను, తయారు చేసే విధానాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సంపత్ కుమార్, ఉపాధ్యాయులు తుమ్మనపెల్లి నరేష్, పంపరి రజిత, నీలిమ, రమ్య, రజిని, తల్లిదండ్రులు మౌనిక, వర్షిని, సౌజన్య, దివ్య,లత తదితరులు పాల్గొన్నారు.

