28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గొర్రె పొట్టేల్లను దొంగతనం చేసిన వారిని పట్టుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • యాదవ సంఘం గంభీరావుపేట మండల అధ్యక్షులు కృష్ణ కాంత్ యాదవ్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం బండ నర్సింలు అనే వ్యక్తికి సంబంధించిన ఆరు గొర్రె పొట్టేల్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గంభీరావుపేట యాదవ సంఘం మండల అధ్యక్షులు కృష్ణ కాంత్ యాదవ్ శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గొర్రె పొట్టేలను గుర్తుతెలియని దొంగలు ఎత్తకపోవడంతో సుమారు నర్సింలు 80 వేల రూపాయలు నష్టపోయారని అన్నారు. గంభీరావుపేట ఎస్సై తో మాట్లాడి వెంటనే ఆ దొంగలను పట్టుకొని వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం మండల ఉపాధ్యక్షులు చేకూటి మహేష్ యాదవ్,మల్లారెడ్డిపేట సంఘం అధ్యక్షుడు బండ దేవరాజు యాదవ్, ఎర్ర గొల్ల అంజయ్య యాదవ్, చేకూటి పెద్ద అంజయ్య యాదవ్,బండ నర్సింలు యాదవ్, శ్రీశైలం యాదవ్,రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article