భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామంలో మండల ప్రజా పరిషత్ నిధులతో నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్ ను శనివారం ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సీ కాలనిలో నీటీ ఏడ్డది ఉందని, నీటి సౌకర్యం చెయ్యాలని విజ్ఞప్తి చెయ్యగా రూ. 75 వేలతో మినీ ట్యాంక్ నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతు గ్రామంలో నిర్మాణం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిని పూర్తి చెయ్యాలన్నారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
