25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల : ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులంతా కలిసి రకరకాల పువ్వులతో ఆకులతో బతుకమ్మను పేర్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఆ తర్వాత విద్యార్థులు అంత కలిసి ఆటపాటలతో బతుకమ్మ పాటలకు ఎంతో సంబరాలతో నృత్యాలు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో బతుకమ్మ పండుగ చాలా గొప్పదని,దాని విశిష్టత అందరికి తెలిసే విధంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్,రాజశేఖర్, ప్రవీణ్ శర్మ, గంగాధర్,విజయ్, రాజనర్సయ్య,రాజేందర్ శ్రీనివాస్,గంగా మోహన్, నరేష్,ట్వింకిల్,సమత కోమలి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article