27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దేవిమాత మండపాలకు పట్టుచీరలు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డీఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు, ట్రస్ట్ చైర్మన్  ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించిన సందర్బంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందని అన్నారు. హిందూ బంధువులు ఆడపడుచులు అంత ఐక్యతతో,భక్తి శ్రద్దలతో  నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూ  ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవాలాందించడానికి ముందుంటమన్నారు,అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ధన్ పాల్ లక్ష్మీబాయి అండ్ విఠల్ గుప్త ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article